Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలీసు వాహనంలో డబ్బు తరలింపు.. కన్నడ హోంమంత్రిపై అనుమానాలు?

కర్ణాటక హోంమంత్రి అశోక్ పోటీ చేస్తున్న పద్మనాభనగర్ నియోజకవర్గంలో భారీగా డబ్బు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు వాహనంలో డబ్బు తరలిస్తుండడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్నికల అధికారులు ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోంది. కాగా, కర్ణాటక అసెంబ్లీకి రేపు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. పోలింగ్ సమయాన్ని సాయత్రం 6 గంటల వరకు పొడిగిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు.

More Telugu News